ప్రేమికులు తమ అమితమైన ప్రేమను ఒకరితో ఒకరు పంచుకొనేందుకు ప్రేమగా ముద్దులు పెట్టుకుంటారు. అయితే ముద్దులు ఎన్ని రకాలో, వాటి ఉద్దేశాలు ఏంటో తెలుసుకుందాం.

బుగ్గ మీద ముద్దు అనేది ఆప్యాయతను తెలియజేస్తుంది. ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను చూపించేందుకు ఈ ముద్దు పెడుతుంటారు. 

నుదిటి మీద ముద్దు- రక్షణ భావనను కల్పిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని, అభిమానాన్ని రేకెత్తిస్తుంది. ప్రేమికుల మధ్యే కాకుండా రక్షణగా ఉంటామనే భావన కలిగిస్తుంది. 

 ప్రేమించే వ్యక్తి చేతి మీద ముద్దు పెడితే అది గౌరవాన్ని సూచిస్తుంది. మీకు వాళ్లు ఎంతో విలువ ఇస్తున్నారనేది తెలుస్తుంది.

ముక్కు మీద ముద్దు చాలా తక్కువ సందర్భాల్లో పెట్టుకుంటారు. ఇష్టపడుతున్న వ్యక్తి మీద ప్రేమ ఉందనే విషయాన్ని ఈ ముద్దు తెలియజేస్తుంది. 

మెడపై ముద్దు.. ఇది సాధారణంగా ప్రేమికులు ఒకరి పట్ల ఒకరు శృంగార ఉద్దేశాలను తెలియజేసే క్రమంలో పెట్టుకుంటారు.

చివరిది ఫ్రెంచ్‌ కిస్‌. ముద్దులన్నింటిలో ఉద్వేగభరితమైన ముద్దు. చాలా మంది ఇష్టపడతారు. ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు ఎంతో ఇష్టంగా పెట్టుకుంటారు.