NTV Telugu Site icon

100 Jio towers: ఒకేసారి 100 జియో టవర్లు ప్రారంభం.. మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు

Jio Towers

Jio Towers

100 Jio towers: ఒకే సారి 100 జియో టవర్లను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమం జరిగింది.. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ టవర్లను ఏర్పాటు చేసింది జియో.. ఈ రోజు ఒకేసారి 100 జియో టవర్లను ప్రారంభించారు సీఎం.. ఈ టవర్ల ద్వారా 209కు పైగా మారుమూల గ్రామాలకు 4జీ సేవలు అందనున్నాయి.. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్‌ కడప జిల్లాలో 2 టవర్లను ఏర్పాటు చేశారు.. ప్రస్తుతం ఈ టవర్ల దర్వారా 4జీ సేవలు అందనుండగా.. భవిష్యత్తులో 5జీ సేవలను అప్‌గ్రేడ్‌ చేయడం ప్లాన్‌గా పెట్టుకుంది రిలయన్స్‌ జియో..

Read Also: Harish Rao-KTR: సిద్దిపేటలో ఐటీ హబ్‌.. ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు

ఇక, కొత్తగా ప్రారంభించిన సెల్‌టవర్ల ద్వారా మారుమూల ప్రాంతాల నుంచి నేరుగా సీఎం వైఎస్‌ జగన్‌తో వర్చువల్‌గా పాల్గొన్నారు ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు.. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో ఇంటరాక్ట్‌ అయిన ముఖ్యమంత్రి.. ఈ ప్రాజెక్టు కింద కొత్తగా 2,704 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు చేయడంగా లక్ష్యంగా ఉండగా.. దీనికోసం ఇప్పటికే 2,363 చోట్ల స్థలాలు జియోకు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. డిసెంబర్‌ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయడం టార్గెట్‌గా పెట్టుకున్నారు.. కాగా, భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినా.. అవి సిటీలు, పట్టణాలకే పరిమితం అయ్యాయి.. అయితే, మారుమూల ప్రాంతాలు 2జీకే పరిమితం అయ్యాయి.. కొన్ని ప్రాంతాల్లో ఆ సేవలు కూడా లేవు.. ఇప్పుడు రిలయన్స్‌ జియో సహకారంతో మారుమూల ప్రాంతాల్లో సైతం 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.