NTV Telugu Site icon

AP Government Jobs: గుడ్‌న్యూస్‌.. వర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

Cm Ys Jagan

Cm Ys Jagan

AP Government Jobs: నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. యూనివర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో భారీ రిక్రూట్‌మెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.. మొత్తం 3,295 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు.. నవంబర్‌ 15వ తేదీ నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో పూర్తి స్ధాయి రెగ్యులర్‌ సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపారు సీఎం జగన్‌.. యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుతో పాటు, ట్రిపుల్‌ ఐటీల్లో 660 పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది.

Read Also: Rythu Runa Mafi: తెలంగాణలో రుణమాఫీ షురూ.. తొలిరోజు 44,870 మంది రైతులకు లబ్ది

ఇక, విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ ఇలా ఉండనుంది.. ఆగస్టు 23వ తేదీన యూనివర్సిటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడనుంది.. సెప్టెంబర్‌ 3, 4 వారాల్లో పరీక్షలు నిర్వహించనుంది ఏపీపీఎస్సీ.. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించబోతున్నారు.. అక్టోబర్‌ 10వ తేదీ నాటికి పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నారు. రిటన్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదల అనంతరం నెల రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. నవంబర్‌ 15 నాటికి ఇంటర్వ్యూలు సహా నియామక ప్రక్రియ పూర్తి చేసి.. అదే రోజు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను డిస్‌ప్లే చేయనున్నాయి ఆయా యూనివర్సిటీలు. ఎడ్యుకేషన్‌ ఫీల్డ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది శుభవార్త మరి.. ఇంకే ముందు.. ఇప్పటికే ప్రిపరేషన్‌లో ఉన్నవాళ్లు మరింత దృష్టి పెట్టండి.. మరోసారి పుస్తకాలను తిరగేయండి.