NTV Telugu Site icon

CM YS Jagan: రైతులకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: విదేశాల్లో డిమాండ్‌ ఉన్న వంగడాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఈ సమీక్షా సమావేశంలో రబీలో ఈ– క్రాప్‌ బుకింగ్‌ పై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కింద కిసాన్‌ డ్రోన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.. ఈ జులై నాటికి 500 డ్రోన్లు ఇచ్చేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేయగా.. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 1,500కు పైగా డ్రోన్లు ఇచ్చే దిశగా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటుంది.. ఇక, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు వర్శిటీ చర్యలు తీసుకుంటున్నాయి.. విజయనగరంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

Read Also: Singer Sunitha: సింగర్ సునీత భర్తకు ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు

మరోవైపు ధాన్యానికి మరింత ధర వచ్చేలా రైతులకు తగిన అవకాశాలు కల్పించాలని.. విదేశాల్లో డిమాండ్‌ ఉన్న వంగడాలను సాగు చేయడంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌.. రైతులకు అవసరమైన వంగడాలు, వాటి విత్తనాలను అందుబాటులో ఉంచాలన్న ఆయన.. సీఎం యాప్ ద్వారా వివిధ ప్రాంతాల్లో వివిధ పంటలకు వస్తున్న ధరలు, వాటి పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. నిరంతరం మాక్‌ డ్రిల్‌ చేస్తూ పని తీరును పర్యవేక్షించాలన్నారు. ఇక, మే నెలలో రైతు భరోసా ఇన్‌స్టాల్‌మెంట్‌ ఇచ్చేందుకు సిద్ధం కావాలని.. వైయస్సార్‌ రైతుభరోసా కింద రైతులకు డబ్బు జమ చేసేందుకు సిద్ధం కావాలని.. అర్హులైన రైతుల జాబితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలని.. మే 10 కల్లా అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై సమీక్ష సందర్భంగా అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌.