CM YS Jagan: కురుక్షేత్ర యుద్ధం జరుగనుంది.. పేదల వైపు ఉన్న ప్రభుత్వానికి, పేదలను వంచించిన ప్రత్యర్థులకు మధ్య ఈ యుద్ధం జరగబోతోంది.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా పాదయాత్రలో అందరి కష్టాలు స్వయంగా చూశాను.. అక్కడి నుంచి ఈ సంక్షేమ పథకాలు అన్నీ పుట్టుకు వచ్చాయన్నారు.. మన ప్రభుత్వం వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ గా అభివర్ణించారు.. ఇక, కురుక్షేత్ర యుద్ధం జరుగనుంది.. పేదల వైపు ఉన్న ప్రభుత్వానికి, పేదలను వంచించిన ప్రత్యర్థులకు మధ్య యుద్ధం.. సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య యుద్ధం ఉండబోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో 80 శాతం పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీట్లు ఇచ్చాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే పెద్ద పీట వేసిన మన ప్రభుత్వానికి, ఎస్సీగా ఎవరైనా పుట్టాలి అపుకుంటారా? అన్న అహంకారానికి, బీసీల తోకలు కట్ చేస్తా అన్న కండకావరానికి మధ్య యుద్ధం అన్నారు..
Read Also: US White House: వైట్‌హౌస్‌లో ఆంధ్రా విద్యార్థులు సందడి.. కారణం ఇదీ..
ఇక, పేదలకు ఇళ్లు ఇవ్వాలని పోరాడుతున్న మన ప్రభుత్వానికి, కోర్టులకు వెళ్లి పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకుంటున్న పెత్తందార్లకు మధ్య యుద్ధం అన్నారు సీఎం జగన్.. ఫైబర్ గ్రిడ్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం, స్కిల్ స్కాం, అసైన్డ్ భూముల ల్యాండ్, నీరు చెట్టు పేరుతో దోపిడి, జన్మభూమి కమిటీల పేరుతో లూటీ చేసిన వారితో యుద్ధం జరగనుంది.. దోచుకోవడం, పంచుకోవటం, తినటం నా విధానం కాదు.. వాళ్లు చెబుతున్న మోసాలు, అబద్దాలు నమ్మకండి అని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే వాళ్లంతా మీ ఇంటికి వస్తారు.. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాం అంటారు.. ఒక బెంజ్ కార్ ఇస్తాం అంటారు.. పెత్తందార్లకు, పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం అని గమనించండి అని సూచించారు. పేద వాడిని రక్షాంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాం.. పేద ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు అడుగులు వేయాలన్నారు. పేదలను మోసం చేసే ప్రభుత్వం రాకుండా అడ్డుకునే దిశగా అడుగులు వేయాలి.. ఈ యుద్ధంలో కులాలు, మతాలు లేవు.. పేదవారంతా ఒక వైపు, పెత్తందార్ల ఒక వైపు ఉన్నారని పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్.