NTV Telugu Site icon

YS Jagan: రూటు మార్చిన వైఎస్‌ జగన్‌.. పార్టీ కార్యక్రమాలపై ఫోకస్

Jagan

Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రూట్‌ మార్చారు.. సంక్షేమ పథకాలు, రివ్యూలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నర ఆయన.. ఇప్పుడు.. పార్టీ కార్యక్రమాల పై ఫోకస్‌పెట్టనున్నారు.. మండల స్థాయి నేతలతో ప్రత్యేకంగా సమావేశం కావాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు.. అక్టోబర్‌ 9వ తేదీన విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.. వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపైన్ ను క్షేత్ర స్థాయిలో తీసుకుని వెళ్లే విధంగా శ్రేణులను సమాయత్తం చేయటమే సమావేశ ఎజెండా ఉందంటున్నారు.. మూడు నుంచి నాలుగు వేల మంది మండల స్థాయి ముఖ్య నేతలు హాజరయ్యే విధంగా కసరత్తు చేస్తోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ..

Read Also: Poorna : ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను..

కాగా, ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఆ నియోజకవర్గంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఎంత ఖర్చు చేసిందో నేతలకు, కార్యకర్తలకు వివరించిన ఆయన.. గడపగడపకు వెళ్లండి.. మన ప్రభుత్వం ఏం చేసిందో వెళ్లండి అని సూచిస్తూ వచ్చారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగానే కాకుండా.. ఇప్పుడు మండలాలపై కూడా ఫోకస్‌ పెట్టబోతున్నారు.. స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశం కాబోతున్నారు. మొత్తంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. మరోవైపు పార్టీపై కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.

Show comments