Poorna : ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ పూర్ణ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ భామ తెలుగు తమిళ మరియు మలయాళీ భాష చిత్రాలలో నటించి మెప్పించింది.ఇక ఈ మధ్యకాలంలో ఈ భామ హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఒకవైపు సినిమాలలో మరొకవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పూర్ణ ఎంతో బిజీగా వున్నారు.. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ భామ. రీసెంట్ గా పెళ్లి చేసుకొని ఒక కుమారుడికి జన్మనిచ్చి తల్లిగా కూడా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు.ఇక పూర్ణ గర్భవతిగా ఉన్న సమయంలోనే నాని హీరోగా నటించిన దసరా సినిమాలో నటించారు. ఇక ఈమె ఈ సినిమా విడుదలైన తర్వాత కొడుకుకి జన్మనిచ్చింది.. అయితే గర్భంతోనే పూర్ణ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు కాస్త ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె వెల్లడించారు.
ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ దసరా సినిమాలో తన పాత్రకు ఎక్కువగా రాత్రిపూట చిత్రీకరించే సన్నివేశాల్లే ఉన్నాయని ఆమె తెలిపారు.ఇలా రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల గర్భవతిగా ఉన్న తనకి ఎన్నో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు.అంతేకాకుండా రెండు రోజులపాటు వర్షంలో తడుస్తూ చేయాల్సిన సన్నివేశాలు కూడా ఉండటంతో ఆ చల్లని నీళ్లు నాపై పడటం వల్ల నాకు మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టిందని ఆమె తెలిపారు. అయితే నా సమస్యలను గుర్తించినటువంటి మేకర్స్ వేడి నీళ్లు పోస్తూ ఈ సినిమా షూటింగ్ చేశారని ఆమె తెలిపారు.ఇలా ఈ సినిమా షూటింగ్ సమయంలో అంత చలిలో పైగా రాత్రిపూట సినిమా షూట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డామని అలాగే రోడ్డుపై ఎవరూ లేకుండా ఒంటరిగా కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పరిగెత్తే సన్నివేశం కూడా ఉంది ఆ సమయంలో కూడా తాను మరింత ఇబ్బంది పడ్డానని ఆమె తెలిపారు. ఇలా రాత్రి సమయంలో ఎంతో కష్టపడి నటిస్తే కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారని పూర్ణ తెలియజేశారు.
Also Read
- Teja Sajja Engagement: ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన ప్రముఖులు..!
- Cyclone Aquan Alert: అక్వాన్ తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. యాక్షన్ ప్లాన్ రెడీ.. అధికారులకు కీలక ఆదేశాలు
- AP High Court: విజయ డెయిరీ బోర్డుకు హైకోర్టు షాక్.. చైర్మన్ సహా ఐదుగురి ఎన్నిక చెల్లదు..!
- TDP vs YSRCP: గుడివాడ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీలో చేరిన టీడీపీ నేత
- Tags
- Dasara Movie
- Nani
- Poorna
తాజావార్తలు
-
Teja Sajja Engagement: ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన ప్రముఖులు..!
-
Cyclone Aquan Alert: అక్వాన్ తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. యాక్షన్ ప్లాన్ రెడీ.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Ramayana Box Office Collections: ‘రామాయణ’ రికార్డుల వేట.. ‘ధురంధర్ 2’ మరో రికార్డు బద్దలు!
-
AP High Court: విజయ డెయిరీ బోర్డుకు హైకోర్టు షాక్.. చైర్మన్ సహా ఐదుగురి ఎన్నిక చెల్లదు..!
-
Thailand Phuket Fire Accident: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 17 మందికి గాయాలు!
ట్రెండింగ్
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!