Site icon NTV Telugu

CM YS Jagan: 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్ పాలన ఉందా? ఆ హామీల సంగతి ఏంటి..?

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్ పాలన ఉందా? అని నిలదీశారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. కావలిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మేం చేసిన దాంట్లో కనీసం 10 శాతమైనా అయినా చేశారా? అని నిలదీశారు. 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి అమలకు సాధ్యం కానీ హామీలను ఇచ్చారు.. ముఖ్యమైన హామీలను చంద్రబాబు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు అని గుర్తుచేశారు సీఎం జగన్.. నరేంద్ర మోడీ, పవన్‌ కల్యాణ్‌ ఫోటోలు కూడా ఈ కరపత్రంలో వేశారు.. రైతులకు రుణమాఫీ.. పొదుపు సంఘాలకు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పారు. కానీ, వాటిని అమలు చేయలేదు.. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25వేల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు.. ఒకరికైనా చేశారా? అని ప్రశ్నించారు. ఇంటింటికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు.. ఇచ్చారా? అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇస్తానని చెప్పారు.. ఒకరికైనా ఇచ్చారా? అని నిలదీశారు.

Read Also: IPL 2024: ఎయిర్‌పోర్టులో అభిమానులపై రోహిత్ శర్మ ఆగ్రహం.. వేలు చూపిస్తూ మరీ..!

ఇక, చేనేతలకు రుణమాఫీ అన్నారు.. చేశారా? రాష్ట్రాన్ని సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తామని చెప్పారు.. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.. ఏవీ నెరవేర్చలేదు అని దుయ్యబట్టారు సీఎం జగన్.. ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా అని అడుగుతున్నాను.. ఇప్పుడు కూడా ఇదే కూటమి మరోసారి ఎన్నికలకు వస్తోంది.. మరోసారి రంగు రంగుల పేపర్లతో మేనిఫెస్టో తెస్తున్నారు.. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అంటున్నారు.. ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబును నమ్మితే ప్రజలు మోసపోవడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో ప్రజలంతా మద్దతు ఇవ్వాలి.. ప్రజలంతా స్టార్ క్యాంపెనర్లుగా మారి పేదవాడి ఇంటికి వెళ్లి నిజాలు చెప్పి వారిని కూడా స్టార్ట్ క్యాంపెనర్లుగా మార్చాలని అని సూచించారు. విశ్వసనీయతకు.. వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది.. మంచి జరగాలంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

Exit mobile version