CM YS Jagan: 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్ పాలన ఉందా? ఆ హామీల సంగతి ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్ పాలన ఉందా? అని నిలదీశారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. కావలిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మేం చేసిన దాంట్లో కనీసం 10 శాతమైనా అయినా చేశారా? అని నిలదీశారు. 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి అమలకు సాధ్యం కానీ హామీలను ఇచ్చారు.. ముఖ్యమైన హామీలను చంద్రబాబు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు అని గుర్తుచేశారు సీఎం జగన్.. నరేంద్ర మోడీ, పవన్ కల్యాణ్ ఫోటోలు కూడా ఈ కరపత్రంలో వేశారు.. రైతులకు రుణమాఫీ.. పొదుపు సంఘాలకు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పారు. కానీ, వాటిని అమలు చేయలేదు.. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25వేల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు.. ఒకరికైనా చేశారా? అని ప్రశ్నించారు. ఇంటింటికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు.. ఇచ్చారా? అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇస్తానని చెప్పారు.. ఒకరికైనా ఇచ్చారా? అని నిలదీశారు.
Read Also: IPL 2024: ఎయిర్‌పోర్టులో అభిమానులపై రోహిత్ శర్మ ఆగ్రహం.. వేలు చూపిస్తూ మరీ..!
Also Read
- Melodi: ‘‘ఇన్‌స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్‌గా మోడీ-మెలోనీ
- Twisha Sharma: ఇంకా బయటకు రాని ట్విషా శర్మ రెండో పోస్ట్‌మార్టం రిపోర్ట్.. కారణమిదేనా?
- Ilhan Omar: పచ్చి భారత వ్యతిరేకి ఎల్హాన్ ఒమర్, మరోసారి విషం చిమ్మింది..
- Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
ఇక, చేనేతలకు రుణమాఫీ అన్నారు.. చేశారా? రాష్ట్రాన్ని సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తామని చెప్పారు.. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.. ఏవీ నెరవేర్చలేదు అని దుయ్యబట్టారు సీఎం జగన్.. ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా అని అడుగుతున్నాను.. ఇప్పుడు కూడా ఇదే కూటమి మరోసారి ఎన్నికలకు వస్తోంది.. మరోసారి రంగు రంగుల పేపర్లతో మేనిఫెస్టో తెస్తున్నారు.. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అంటున్నారు.. ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబును నమ్మితే ప్రజలు మోసపోవడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో ప్రజలంతా మద్దతు ఇవ్వాలి.. ప్రజలంతా స్టార్ క్యాంపెనర్లుగా మారి పేదవాడి ఇంటికి వెళ్లి నిజాలు చెప్పి వారిని కూడా స్టార్ట్ క్యాంపెనర్లుగా మార్చాలని అని సూచించారు. విశ్వసనీయతకు.. వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది.. మంచి జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి..
తాజావార్తలు
-
Melodi: ‘‘ఇన్‌స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్‌గా మోడీ-మెలోనీ
-
“Aadarsha Kutumbam” కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
-
Twisha Sharma: ఇంకా బయటకు రాని ట్విషా శర్మ రెండో పోస్ట్‌మార్టం రిపోర్ట్.. కారణమిదేనా?
-
Vijay Deverakonda: దేవరకొండకు క్రికెట్ అసోసియేషన్ షాక్!
-
Ilhan Omar: పచ్చి భారత వ్యతిరేకి ఎల్హాన్ ఒమర్, మరోసారి విషం చిమ్మింది..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!