Site icon NTV Telugu

CM YS Jagan: చంద్రబాబు మీకు ముఖం చూపించగలడా? సీఎం ఫైర్‌

Jagan

Jagan

CM YS Jagan: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావించబట్టే మీ ఇంటి ముందు నిలబడి ఆశీర్వదించమని అడగగలుగుతున్నా.. ఆ అడిగే అర్హతకాని, నైతికత కాని, మీ బిడ్డ మీరిచ్చిన అధికారంతో దేవుడి దయతో మెండుగా మంచి చేయగలిగాడని చెప్పగలుగుతున్నా.. ఇదే మాటలను చంద్రబాబు అడగగలరా? అనగలరా? చంద్రబాబు మీకు ముఖం చూపించగలడా? అంటూ ఫైర్‌ అయ్యారు.. 1995లో అధికారంకోసం సొంత మామను వెన్నుపోటు పొడిచాడు.. ఈ 28 సంవత్సరాల్లో మీకుటుంబానికి జరిగిన మంచి ఏంటని చెప్పడానికి చంద్రబాబు వద్ద ఏమీ లేదన్నారు.. 2019లో దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్ల సీఎం అయిన మీ అన్న, తమ్ముడు, బిడ్డ.. మీ జగన్‌ వల్ల మీ కుటుంబానికి జరిగిన మంచి ఏంటని అడిగేత.. ఏ గ్రామానికి వెళ్లినా, ఏ కుటుంబాన్ని అడిగినా.. మా జగన్‌ మంచి చేశాడని చెప్పడానికి ఉంది.. ఏ మంచి చేయడని చంద్రబాబుకు కొందరు ఎంతుకు మంచి చేస్తున్నారంటే దాని కారణం.. మన అందరి ప్రభుత్వంతో డీబీటీ ఇస్తే.. వారు దోచుకో.. పంచుకో.. తినుకో చేశారంటూ ఎద్దేవా చేశారు..

జన్మభూమి కమిటీలతో మొదలుపెడితే.. అన్ని దోచుకో.. పంచుకో.. తినుకో.. అని గజదొంగల ముఠా దోచేశారన్న సీఎం జగన్.. చంద్రబాబు పునాది అబద్ధం, మోసం అన్నారు.. నాలుగేళ్లుగా మనం మంచిచేస్తే.. 40 ఏళ్లలో ఏ ఒక్కరికీమంచి చేయని వారు ఒకవైపున ఉన్నారు.. ఒకవైపున పేదవాళ్ల పార్టీ ఉంటే.. ఇంకోవైపున పెత్తందార్లు ఉన్నారని విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రకోసం మన ప్రభుత్వం వేస్తు అడుగులు ప్రజలకు చెప్తాను.. మన్యం వీరుడు అల్లూరు జన్మించిన పౌరుషాల గడ్డ.. ఆ వీరుడి పేరు జిల్లాకు పెట్టాం.. మూడు జిల్లాల ఉత్తరాంధ్రను మరింత మెరుగుపరుస్తూ ఆరు జిల్లాలు చేశాం.. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ పనులను మొదలుపెట్టాం, పూర్తిచేశాం.. జూన్‌ మాసంలో ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నాం, జాతికి అంకితం చేయబోతున్నాం అని ప్రకటించారు.. ఉద్దానం ప్రాంతానికి రూ.700 కోట్లతో తాగునీటి పథకాన్ని జూన్‌లో ప్రారంభిస్తున్నాం.. మనమే మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇదన్నారు.. పాతపట్నం నియోజకవర్గానికి మంచి చేస్తూ మరో రూ.265 కోట్లతో ఇదే తాగునీటి పథకాన్ని విస్తరింపచేస్తున్నాం అన్నారు సీఎం జగన్‌.

ఉత్తరాంధ్ర ప్రజలు బాగా చదవాలన్న ఉద్దేశంతో ఎప్పుడూ జరగని విధంగా కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు సీఎం.. పాడేరులో మెడికల్‌ కాలేజీల పనులు జరుగుతున్నాయి.. నర్సీపట్నం, విజయనగరం కాలేజీ పనులు వేగంగా జరగుతున్నాయి.. విజయనగరం మెడికల్‌ కాలేజీకి నేను త్వరలో ప్రారంభోత్సవం చేస్తున్నాం.. కొత్తగా నాలుగు మెడికల్‌ కాలేజీలు ఉత్తరాంధ్రకు వచ్చాయి.. సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీకి జూన్‌ జులైలో పనులు చేస్తున్నాం అన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Exit mobile version