NTV Telugu Site icon

CM YS Jagan: ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్‌ భేటీ

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ పార్టీ కేడర్‌ను కూడా రెడీ చేస్తున్నారు. ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. మళ్లీ వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పలు నియోజకవర్గాలకు ఇంఛార్జిలను కూడా మార్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ప్రాంతాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతలతో సమావేశమై.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి తెలుసుకుంటున్నారు. గెలుపు ఆవశ్యకతపై వివరిస్తున్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ వచ్చే ఎన్నికల గెలవాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ దిశానిర్దేశం చేస్తున్నారు.

తాజాగా వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. స్థానిక సమస్యలు, క్షేత్ర స్థాయి అంశాలపై అభిప్రాయాల గురించి నేతలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ స్థానికంగా పర్యటించాలని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

Read Also: Peddireddy Ramachandra Reddy: 7 సార్లు గెలిచారు.. కుప్పంలో ప్రజల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా?

సొంత జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్సార్‌ ఘాట్‌కు వెళ్లారు.. మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించారు సీఎం వైఎస్‌ జగన్‌, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ నేతలు.. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు.. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని ప్రార్థనల్లో పాల్గొంది సీఎం ఫ్యామిలీ.. అటు క్రిస్మస్‌ వేడుకల్లోనూ ముఖ్యమంత్రి పాల్గొన్నారు.