NTV Telugu Site icon

CM YS Jagan: సీఎం మాత్రమే మారాడు.. అప్పుడు ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది..!

Jagan

Jagan

CM YS Jagan: సీఎం మాత్రమే మారాడు.. అప్పుడు ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఆలోచించాలి అని సూచించారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన జగనన్న చేదోడు సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి ప్రభుత్వం వస్తుంది.. ఎవరికి లంచాలు ఇవ్వకుండా.. ఇలాంటి సహాయం అందుతుందని నాలుగేళ్ల క్రితం ఎవరైనా అనుకున్నారా..? అని ప్రశ్నించారు. సీఎం మాత్రమే మారాడు.. అప్పుడు ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎందుకు జరుగుతుందో ఆలోచించాలన్నారు.. అప్పట్లో గజదొంగల ముఠా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం.. అప్పటికి ఇప్పటికి తేడా ఇదే అన్నారు. మంచి మనసుతో అండగా వుండే ప్రభుత్వం కావాలని పేదలు కోరుకుంటున్నారని తెలిపారు.

చంద్రబాబు పాలన చూస్తే కుప్పం ప్రజలు కూడా మా వాడు అని చెప్పే పరిస్థితి లేదన్నారు సీఎం వైఎస్ జగన్.. కుప్పంలో పేద వానికి ఇల్లు ఇవ్వని పరిస్థితి.. కుప్పంలో 20 వేల ఇళ్ల స్థలాలు మేమిచ్చాం అన్నారు. చంద్రబాబు హయాంలో 80 వేల కోట్లు రుణ మాఫీ చేస్తామని అమలు చేయలేదు.. వైసీపీ హయాంలో రైతుకు తోడుగా వుంటూ నడిపిస్తున్నాం అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టో అధికారంలోకి వచ్చాక చెత్తబుట్టలో వేశారని తెలిపారు. వైసీపీ ఎన్నికల మానిఫెస్టోలో 99 శాతం నెరవేర్చాం అని స్పష్టం చేశారు. జన్మభూమి కమిటీలు మొదలు, రాజధాని భూముల స్కామ్, స్కిల్ స్కాం.. ఇలా చంద్రబాబు పాలన సాగిందని ఆరోపణలు గుప్పించారు. ఎక్కడా అవినీతి లేకుండా, లంచం ఇవ్వకుండా 2.38 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేశాం.. టీడీపీ, వైసీపీ పాలన మధ్య తేడా గమనించండి అని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు హయాంలో పొదుపు రుణాలు మాఫీ చేస్తామని సున్నా వడ్డీ కూడా తీసేశారిని విరుచుకుపడ్డారు సీఎం జగన్‌.. పొదువు మహిళలకు ఇచ్చిన మాట తప్పారని విమర్‌శించారు. కానీ, పొదువు సంఘాల ఎన్ పీ ఏ లు 18 శాతం నుంచి 0.03 శాతానికి తగించ గలిగాం అని స్పష్టం చేశారు. చంద్రబాబు ఒక్క సెంటు స్థలం ఇవ్వలేకపోయారు.. మా హయాంలో 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాం.. 22 లక్షల ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి.. 2 లక్షల 7 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. 80 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాం అని వెల్లడించారు. మరవైపు.. ఆరోగ్యశ్రీ కింద గతంలో వెయ్యి వ్యాధులు కవర్ అయితే ఇప్పుడు 3 వేల వ్యాధులు కవర్ అవుతున్నాయని తెలిపారు.. రాజధానిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాబోయేది కురుక్షేత్ర సంగ్రామం.. పెత్తందారులు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు సీఎం జగన్.. రాబోయేది క్లాస్ వార్.. కౌరవులు, తోడేళ్లు ఏకమవుతారు.. కానీ, మీ బిడ్డ నమ్ముకున్నది దేవుణ్ణి, మిమ్మల్ని మాత్రమే అన్నారు.. ఓటు వేసేటప్పుడు మీకు మంచి జరిగిందా.. లేదా కొలమానంగా తీసుకోండి.. మంచి జరిగివుంటే మీ బిడ్డకు మీరే సైనికునిగా నిలవండి అంటూ విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.