NTV Telugu Site icon

CM YS Jagan: బీ ఫామ్ ఏ పార్టీది అయినా.. యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే..!

Jagan

Jagan

CM YS Jagan: మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల కూటమి ఎలాంటిది అంటే.. బీ ఫామ్ ఏ పార్టీది అయినా.. యూనిఫామ్‌ మాత్రం చంద్రబాబుదే అంటూ దుయ్యబట్టారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కాకినాడ మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాకినాడ సిద్ధం.. ఇక్కడి జన సమూహాన్ని చూస్తుంటే కాకినాడలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నిండు గోదావరి కనిపిస్తోంది. అభిమాన నిండు గోదావరి కనిపిస్తోందన్నారు. మీ అందరి ముఖంలో ఐదేళ్లలో మంచి చేసిన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే తపన కనిపిస్తోంది. ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి. ఒక వైపున ఎన్నికల నోటిఫికేషన్ నగార మోగింది. మరో వైపు పేదలంతా ఎన్నికల జైత్రయాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ.. సింహ గర్జన చేస్తున్నారు. ఇంటింటి, అక్క చెల్లమ్మలు, పెద్ద వర్గాల ఆత్మగౌరవం కాపాడుతున్న మన వైఎస్సార్ ప్రభుత్వానికి మద్దతుగా పలికేందుకు మీరంతా సిద్దమా..? అని ప్రశ్నించారు. ఈ రోజు రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోంది. పేదలు పేదలుగానే ఉండాలన్న పెత్తం దారిలా దోపిడీని అరికట్టేలా ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్దమా..? అంటూ సభికులను ప్రశ్నించారు.

రాబోయే 5 ఏళ్లు అంటే 1,820 రోజులు మన బతుకులు ఎలా ఉండాలో మన ఓటే నిర్ణయిస్తుంది.. మన బతుకులు మార్చే వారికే ఓటేయాలి. మీ జగన్ ద్వారా అందుతున్న పథకాలు భవిష్యత్ లో కూడా అందాలా లేక రాద్దు కావాలా అన్నది మీ ఓటే నిర్ణయిస్తుందన్నారు సీఎం జగన్‌.. ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తే అన్నీ పథకాలు ఇంటికే అందుతాయి. సాధ్యం కానీ హామీలతో మళ్ళీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యారని గుర్తు పెట్టుకోవాలి. మీ బిడ్డ జగన్ కు ఓస్తే మీ ఊళ్ళో సచివాలయం కొనసాగుతుంది. బాబుకు ఓటేస్తే.. ఇవన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు. ప్రతి ఊళ్లోకి జన్మభూమి కమిటీలు వచ్చేస్తాయి. ఫ్యాన్ కు ఓటేస్తేనే.. వృద్దాప్య పింఛన్లు, అక్క చెల్లమ్మలకు సాయం అందించే మీ బిడ్డ మార్క్ పాలన కొనసాగుతుంది. లేకుంటే బాబు మార్క్ పాలన వస్తుంది. దోచుకొని పంచుకునే విధానం వస్తుంది. చంద్రబాబుకు ఓటేస్తే పశుపుపతిలా ఇదేళ్లు మీ రక్తం తాగేందుకు వస్తారు అన్నారు. ఫ్యాన్ కు ఓటేస్తేనే రైతులకు ఊళ్ళో అందుతున్న వ్యవసాయ సేవలు పక్కాగా కొనసాగుతాయి. ఫ్యాన్ కు ఓటేస్తేనే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు అందుతాయి. టోఫెల్ ట్రైనింగ్ నుంచి ట్యాబ్ ల వరకు అన్నీ అందుతాయి. ఇవన్నీటితో మన పిల్లలకు అంది మరో పదేళ్లలో ప్రపంచంతో పోటీ పడతారు. మన పేదల పిల్లలు మాట్లాడే ఇంగ్లీషుకు పెత్తం దారుల పిల్లలు కూడా అసూయ పడతారని తెలిపారు.

చంద్రబాబుకు ఓటేస్తే నాడు నేడు కింద మన పిల్లలకు అందుతున్న ప్రతి లబ్ది ఆగిపోతుంది. చంద్రబాబుకు ఓటేస్తే అన్నీ కత్తిరింపులు.. ముగింపులే.. మనం ఓటేయడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా మళ్లీ చంద్రముఖి నిద్ర లేచి లఖ.. లఖ అని మీ ఇంట్లోకి వస్తుందని వ్యాఖ్యానించారు సీఎం జగన్‌.. ఫ్యాన్ మీద ఓటేస్తేనే రాష్ట్రంలో ప్రారంభించిన విప్లవాలు కొనసాగుతాయి. ఫ్యాన్ కు ఓటేస్తేనే రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల రాజ్యం కొనసాగుతుంది.. ఫ్యాన్ కు ఓటేస్తేనే.. లంచాలు వివక్ష లేకుండా పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు అందుతాయి. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. పిల్లలు, పెద్దలు, ఆడబిడ్డలతో కూర్చొని ఆలోచన చేయండి. మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో వాళ్లకు మాత్రమే ఓటయండి. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీల కోసం కాదు.. వచ్చే ఇదేళ్ళు మీ తలరాతలు మార్చే ఎన్నికలు. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా.. లేక రాష్ట్రాన్ని దోచుకొని పంచుకునే పెత్తం దారుల కూటమి పాలన కావాలా అని ఆలోచన చేయమని కోరుతున్నాను. వేరే పార్టీలకు ఓటేసిన అక్కలను, అన్నలను అడుగుతున్నా.. మీరు గత ఎన్నికల్లో ఓటేయక పోయినా మీకు ఈ ఐదేళ్లలో మంచి చేయలేదా అని అడుగుతున్నా.. మీకు అందిన లబ్ది నిజాలు చెబుతాయి. ఎవరి పాలనలో మీకు. మంచి జరిగిందో ఆలోచింది నిర్ణయం తీసుకోండి అని సూచించారు జగన్‌.

ఇక, జ్వరం వస్తే కూడా హైదరాబాద్ వెళ్లిపోయే సినిమా హీరో ప్రజలకు ఏం మంచి చేస్తారు. నిజమైన లోకల్ హీరో కి ఓటేయండి.. మీకు చేస్తుంది. నేను మరింత మంచి చేయిస్తాను అన్నారు సీఎం జగన్‌.. ఈ ఐదేళ్లలో ప్రతి ఇంటికి మంచి మీ బిడ్డ చేశాడు కాబట్టే ఎన్నికల్లో యుద్దానికి ఒంటరిగా బయలుదేరాడు. పేదలకు ఎన్నడూ మంచి చేయని ఈ కూటమి నక్కలు, తోడేళ్లుగా మరి కుట్రలతో యుద్దానికి వస్తున్నారు. ఐదేళ్లలో ప్రతి ఇంటికి మంచి చేసాం కాబట్టే మన జెండా తల ఎత్తుకుని ఎగురుతోంది. ఎన్నికల కోసం వాళ్ల జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా ఎగరలేక కింద పడుతోందన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష కూటమి, చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పటైన కూటమి. ఆ కూటమిలో ప్యాకేజి స్టార్ టికెట్లు ఎవరికీ ఇవ్వాలో కూడా చంద్రబాబే నిర్ణయిస్తారు. కూటమిలో నిర్ణయాలు.. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. జగన్ ను కొట్టు అంటే కొట్టు.. దత్తపుత్రా నీకు ఇచ్చేది 80 కాదు 20 అంటే దానికి ఓకే.. ప్యాకేజి స్టార్ కు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత చులకన అంటే.. చిన్న జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్లిపోయే అంత చులకన.. కూటమిలో ఉన్న వదినమ్మ చంద్రబాబు చేరమంటే కాంగ్రెస్ లో చేరింది. బిజెపికి ట్రాన్స్ ఫర్ చేయగానే బిజెపిలో చేరింది. చంద్రబాబు చెప్పగానే సొంత తండ్రికి వెన్నుపోటు పొడిచింది. ఇది చంద్రబాబు కోసం మాత్రమే పనిచేస్తున్న వదినమ్మ పరిస్థితి అని దుయ్యబట్టారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.