NTV Telugu Site icon

CM YS Jagan: నేను విన్నాను, నేను ఉన్నాను.. పెరాలసిస్‌ బాధితుడికి సీఎం జగన్ భరోసా!

Pawan Kalyan (3)

Pawan Kalyan (3)

CM YS Jagan Meets Paralysis Victim in Memantha Siddham Bus Yatra: చిత్తూరు జిల్లా సదుం మండలం సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల క్రితం పెరాలసిస్‌కు గురయ్యాడు. ఇప్పటికే స్తోమతకు మించి.. అప్పుల చేసి మరీ వైద్యం చేయించారు కుటుంబ సభ్యులు. అంతంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారికి.. ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి. ముఖేష్ వైద్యానికి మరో 15 లక్షలు అవసరం అవుతాయని డాక్టర్లు చెప్పారు. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న ముఖేష్ కుటుంబంకు ఏం చేయాలో పాలుపోలేదు. సీఎం వైఎస్ జగన్‌ను కలిస్తే.. తప్పక తమకు సహాయం దొరుకుతుందని వారు నమ్మారు.

Also Read: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ తెనాలి పర్యటన వాయిదా.. కారణం ఏంటంటే?

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. సీఎం వారిని బస్సు వద్దకు పిలిపించుకుని.. ముఖేష్ ఆరోగ్య పరిస్థితిని గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. వెంటనే ముఖేష్ వివరాలను తీసుకోవాలని ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు. దాంతో ముఖేష్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం జరిగి మామూలు మనిషి అవుతాడనే నమ్మకం తమకు కలిగిందని ముఖేష్ కుటుంబ సభ్యులు చెప్పారు.

Show comments