NTV Telugu Site icon

CM YS Jagan: మరోసారి సొంత జిల్లాకు సీఎం జగన్.. రెండు రోజుల పాటు పర్యటన

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరోసారి సొంత జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు అన్నమయ్య, కడప జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది.. దీని కోసం రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. ఉదయం 12 గంటలకు రాయచోటి చేరుకుంటారు.. మండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానమ్ కుమారుడు వివాహ వేడుకకు హాజరవుతారు.. మాజీ ఎంపీపీ ఇంట్లో వివాహ వేడుకకు కూడా హాజరుకానున్న జగన్.. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెందుల చేరుకుంటారు.. పులివెందులలో శ్రీ కృష్ణా టెంపుల్ ప్రారంభ వేడుకల్లో పాల్గొంటారు.. అనంతరం స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు శంఖుస్థాపన చేస్తారు.. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్.. రాత్రికి ఇడుపులపాయలో బస చేయనున్నారు..

Read Also: Minister Adimulapu Suresh: పవన్‌కు ఇదే నా చాలెంజ్.. దమ్ముంటే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతోన్న విద్యార్థులతో ఇంగ్లీష్‌ మాట్లాడు..!

మరోవైపు.. ఈ నెల 10న కడప జిల్లాలోనే సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన కొనసాగనుంది.. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆర్కే వ్యాలీ, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్నారు సీఎం జగన్.. అనంతరం రెండున్నర గంటల పాటు వేముల మండల స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు.. దీంతో రెండు రోజుల సీఎం జగన్‌ పర్యటన ముగియనుంది.. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు కడప విమానాశ్రయం నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.