Site icon NTV Telugu

CM Siddaramaiah: బెంగళూరు తొక్కిసలాటపై సీఎం కీలక వ్యాఖ్యలు..!

Cm Siddaramaiah

Cm Siddaramaiah

CM Siddaramaiah: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్ 2025 సీజన్ విజయం అనంతరం జరిగిన విజయోత్సవాల్లో చోటుచేసుకున్న విషాదకర తొక్కిసలాట ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని మేమే నిర్వహించలేదు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యదర్శి, ట్రెజరర్ వచ్చి నన్ను ఆహ్వానించారు. గవర్నర్ కూడా వస్తున్నారన్న సమాచారం అందడంతోనే నేను వెళ్లాను. స్టేడియానికి నన్ను ఆహ్వానించలేదు.. కేవలం ఆహ్వానం మేరకే వెళ్ళానన్నారు.

Read Also: Breaking : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు

విజయోత్సవ ర్యాలీ విధానసౌధ సమీపంలో ముగిసిన తర్వాత అక్కడ ఉన్న క్రికెటర్లను కలిసేందుకు సీఎం, ఇతర నేతలు హాజరయ్యారు. అయితే వీఐపీ హాజరు కారణంగా పోలీసు బలగాల ఫోర్స్ ను విభజించాల్సి వచ్చింది. సుమారు 5,000 మంది పోలీసుల బలగాన్ని ఈ ప్రాంతాల్లో విస్తరించడంతో స్టేడియంలో తగిన భద్రత ఏర్పాట్లు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో విపక్ష బీజేపీ పార్టీ కూడా మా ప్రభుత్వం పై తీవ్రంగా విమర్శలు చేసిందని అన్నారు. పోలీసు ఏర్పాట్లలో అలసత్వం కారణంగానే తొక్కిసలాట జరిగిందని ఆయన అన్నారు.

Read Also: Bharat Ram: తప్పులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..!

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ నగర పోలీస్ కమిషనర్ సహా ముగ్గురు ఉన్నతాధికారులను బాధ్యతా రాహిత్యానికి గురయ్యారంటూ సస్పెండ్ చేసింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, 47 మంది గాయాలపాలయ్యారు. ఐపీఎల్‌లో తొలిసారిగా ట్రోఫీ గెలుచుకున్న RCB ను చూసేందుకు ఎంతో ఉత్సాహంగా లక్షలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి తరలివచ్చారు. కానీ, భారీ జనసందోహం విషాదానికి దారితీసింది.

Exit mobile version