Protest: పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెన్షన్ చేయడంతో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ధర్నా నిర్వహించనున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసనలు జరుగనున్నాయి. అలాగే పార్లమెంట్‌లో సెక్యూరిటీ లోపాలపై కూడా ఇండియా కూటమి నిరసన తెలిపింది. తాజాగా పార్లమెంట్ లో జరిగిన దాడి పైనా ప్రధాని, హోం మంత్రి స్పందించాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంది.
Read Also: Viral Video: ఏంటి తల్లి ఆ తొందర.. క్షణాల్లో గుండె ఆగినంత పనైంది..
అయితే, ఈ నిరసనకు దిగిన ఎంపీలు సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ ధర్నాకు ఇండియా కూటమి నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలోనూ ఈ ధర్నా కొనసాగనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న కార్యక్రమం.. కాబటటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పాల్గొనటం ఆసక్తికరంగా మారింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా నాడు సీఎం హోదాలో కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు, పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర సీఎం హోదాలో రేవంత్ ధర్నా చేస్తుండటం.. పొలిటికల్ గా ఆసక్తికరంగా మారుతోంది.