తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఉదయం 6 గంటలకి కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణితో పాటు కూతురు అల్లుడు మనవరాళ్లతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రూ.251 కోట్లతో మేడారంలో అభివృద్ధి చేసిన గుడి ప్రాంగణాన్ని ప్రారంభించి భక్తులకు అంకితం ఇవ్వనున్నారు. మేడారంలో అభివృద్ధి చేసిన జంక్షన్ లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 7:45 నిమిషాలకి హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లిపోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుంచి దావోస్ పర్యటనకి వెళ్ళనున్నారు. సీఎం మేడారం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read:Russia Ukraine War: ఉక్రెయిన్‌పై నిప్పుల వర్షం కురిపించిన రష్యా..
నిన్న మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పాలనాపరమైన సంస్కరణలు , స్థానిక సంస్థల బలోపేతం లక్ష్యంగా ఈ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలు , జిల్లాల పునర్విభజన వంటి అంశాలపై స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వస్తున్న ఫిబ్రవరి మాసంలోనే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ద్వారా పాలనను మరింత చేరువ చేయాలని, పెండింగ్‌లో ఉన్న వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల ఆమోదంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
