Site icon NTV Telugu

CM Revanth Reddy: “కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేశారు..” ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కూడా విన్నారని అంటున్నారు.. సొంత కుటుంబ సభ్యుల ఫోన్‌ లే ట్యాపింగ్ చేసి వినాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు.. కానీ లీగల్‌గా పర్మిషన్ తీసుకుని చేయాల్సి ఉంటుందన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఫోన్ టాప్ అవుతుందని మొదట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని.. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం సిట్ ఏర్పాటు చేశామని.. చిట్ అధికారులను తాను డిక్టేట్ చేయనన్నారు.

READ MORE: Heavy Rain Alert: అలర్ట్.. తెలంగాణలోని ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ..

తన ఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నా.. తన ఫోన్ ట్యాపింగ్ అయి ఉంటే నన్ను పిలిచేవారు కదా..? అని సీఎం తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.. కవిత పంచాయతీ ఆస్తులు అధికారానికి సంబంధించిందని కొట్టిపారేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ను సుప్రీంకోర్టు అడ్వైజ్ మాత్రమే చేయొచ్చని.. ఆర్డర్ ఇవ్వలేరని గుర్తు చేశారు.

READ MORE: Tejashwi Yadav: “ఎన్నికల్ని బహిష్కరిస్తాం”, బీహార్ పోల్స్‌పై తేజస్వీ యాదవ్ సంచలనం..

Exit mobile version