CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ నివాసంలో రెండో పంటకు సాగు నీటి విడుదలపై సమీక్ష చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే.. నాగార్జున సాగర్ నుండి సాగునీరు విడుదల చేయలేమని సాగర్ సీఈ(CE) తెలిపారు. తాగు నీటి కోసమే నీటి విడుదల అని అధికారులు ప్రకటన చేశారు. ఈ క్రమంలో.. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు, సాగుకు నీటి విడుదల లభ్యత పై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్, అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష చేయనున్నారు.
CM Revanth: రెండో పంటకు సాగు నీటి విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Cm Review