NTV Telugu Site icon

CM Revanth Reddy: ప్రజావాణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Cm Revanth

Cm Revanth

ప్రజావాణి పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించామని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో 54,619 అర్జీలు ప్రజలు నమోదు చేసుకున్నారు. వీటిలో 68.4% (37384) అర్జీలు పరిష్కారమయ్యాయి. ప్రజావాణి అర్జీలను పరిష్కరించేందుకు మరింత పారదర్శకమైన విధానాలు అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్ ను తనకు అందించాలని సీఎం కోరారు. లైవ్ యాక్సెస్ ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్జీల వివరాలతో పాటు.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సమాచారాన్ని ఆన్ లైన్ లో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.