CM Revanth: ఇరిగేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ..

  • ఇరిగేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ
  • సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • అధికారులు నిన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ తో మంత్రి ఉత్తమ్.. ఇరిగేషన్ అధికారులు సమావేశం
  • రేపు మరోసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో సమావేశం.
Cm Revanth Reddy

Cm Revanth Reddy

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇరిగేషన్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. నిన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు సమావేశమయ్యారు. రేపు మరోసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు.

Stock Market vs SIP: స్టాక్ మార్కెట్ లేదా ఎస్ఐపీలో ఎందులో పెట్టుబడి ఉత్తమం..

ఇదిలా ఉంటే.. సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన రైతు రుణమాఫీ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానంకు వివరించనున్నారు. మరోవైపు వరంగల్‌లో ‘రైతు కృతజ్ఞత’ సమావేశానికి రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. అంతేకాకుండా.. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, క్యాబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.