CM Review: సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధరణిపై సమీక్ష ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా పాల్గొన్నారు. సుమారు 2 గంటల పాటు ధరణిపై సమీక్షించారు. ఈ క్రమంలో.. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే.. నెలకు ఒకసారి మండల కేంద్రంలో రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని చర్చించినట్లు సమాచారం. కాగా.. ఎన్నికల్లో ధరణి రద్దు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే..
CM Review: ధరణిపై ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Cm Review