NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు వేములవాడకు సీఎం రేవంత్‌.. ఆలయ అభివృద్ధికి రూ. 127 కోట్లు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వేములవాడలో పర్యటించనున్నారు. దేవాలయ అభివృద్ధికి రూ. 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వం శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్‌ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ. 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్‌ జంక్షన్‌ వరకు డ్రైనేజీ పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.3కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. వేములవాడలో రూ. కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనం ప్రారంభిస్తారు. అలాగే రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

READ MORE: Maharashtra Election 2024: మహారాష్ట్రలో ప్రారంభమైన పోలింగ్.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన ఈసీ..

అంతే కాకుండా రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులు, రూ.50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులు, రూ. 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు రూ.85 లక్షల పరిహారం పంపిణీ చేస్తారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు రూ.102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు అందజేస్తారు. అనంతరం సభలో రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తారు.