CM Revanth: భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తొలి పునాది రాయి వేసిన సీఎం సభావేదిక పై పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా.. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. విజయదశమి మనకు అన్ని విజయాలను చేకూరుస్తుందని.. చాలా మంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. ఇక్కడ రేవంత్‌కు భూములు ఉన్నాయని, నగరం కట్టుకుంటున్నాడని ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు. నాకు భూములు ఉంటే అందరికీ కనిపిస్తాయి.. దాచిపెడితే దాగవు.. కుతుబ్ షాహీలు నగరాన్ని నిర్మిస్తే, వైఎస్సార్, చంద్రబాబు దాన్ని కొనసాగించారు. ఆ నాయకులు ఆలోచన చేశారు కాబట్టే.. ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతున్నాం. వారు మాకెందుకులే అనుకుంటే ఓఆర్ఆర్, శంషాబాద్, హైటెక్ సిటీ వచ్చేవి కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Peddi : రామ్ చరణ్ సినీ ప్రయాణంలో 18 ఏళ్లు పూర్తి.. “పెద్ది” నుంచి మాస్ పోస్టర్ విడుదల!
అలాగే సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తా.. న్యూయార్క్‌లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తా.. మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు పోటీగా నిర్మించకూడదు?.. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నాం.. ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించాం.. అమరావతి నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది.. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం.. కోర్టుల చుట్టూ తిరిగి నష్టపోవొద్దు.. ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
High Tension Chennai: హీరో విజయ్ ఇంటి వద్ద హైటెన్షన్.. మద్రాసు హైకోర్టుకు టీవీకే!
