హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్జ్ లో మరో అడుగు ముందుకు పడింది.. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పాత బస్తీకి మెట్రో మోక్షం లభించింది. ఈ నెల 8న ఓల్డ్ సిటీలో 5 కిలో మీటర్ల మేర మెట్రో మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించింది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ మెట్రో మార్గాన్ని ఓల్డ్ సిటీ మీదుగా ఫలక్ నుమా వరకు పొడిగించనున్నారు.
Read Also: USA: అమెరికాలో మళ్లీ కాల్పులు.. నలుగురు మృతి
ఇక, 2017 నుంచి హైదరాబాద్ లో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి.. అప్పటి నుంచి విడతల వారీగా మెట్రో రూట్లను ప్రారంభించారు. అప్పటి నుంచి ఓల్డ్ సిటీలో 5 కిలో మీటర్ల మెట్రోకి మాత్రం ఎలాంటి ముందడుగు పడలేదు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఓల్డ్ సిటీలో మెట్రోకు లైన్ క్లియర్ అయింది. దీంతో ప్రస్తుతం 69 కిలో మీటర్ల మొదటి దశ మెట్రో ప్రాజెక్టు.. పాతబస్తీ మార్గంతో ఉన్న 74కిలో మీటర్ల మేర మెట్రో సేవలు విస్తరించనున్నాయి..
