CM Revanth Reddy to Visit Osmania University: ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ వెళ్లనున్నారు. సీఎం హోదాలో రెండు సారి ఓయూకి వెళ్లనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఓయూకు వెళ్లారు. డిసెంబర్ లో మళ్ళీ వస్తానని అప్పట్లో మాటిచ్చారు. కాగా.. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ది కోసం రూ. 1000 కోట్లు విడుదల చేశారు. సిబ్బంది నియామకం.. నూతన భవనాల నిర్మాణం, ఓయూలో సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు.
READ MORE: Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వేధింపులు.. జైలు బయట సోదరీమణులు ఆందోళన
కాగా.. ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సూచించారు. ఓయూ అభివృద్ధి పనులకు సంబంధించి ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు వెనుకాడమని తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తొలుత అధికారులు వివరించారు. అనంతరం పనులకు సంబంధించిన వివిధ మోడళ్ల పవర్ పాయింట్ ప్రజంటేషన్స్‌ను ముఖ్యమంత్రి వీక్షించారు. హాస్టల్ భవనాలు, రహదారులు, అకడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి పలు మార్పులు చేర్పులను సూచించారు. ఈ నేపథ్యంలో ఓయూకి రూ.1000 కోట్లు విడదుల చేశారు.
READ MORE: Winter Vegetables to Avoid:చలికాలంలో ఈ కూరగాయలు తింటున్నారా? అయితే జాగ్రత్త!
