Site icon NTV Telugu

CM Revanth Reddy: యాదాద్రి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Cm Revanth Reddy

Cm Revanth Reddy

యాదాద్రి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం, తిరుమలాపురంలో గంధమల్ల రిజర్వాయర్ పనులకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తిరుమలాపురంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. మీటింగ్ అనంతరం చాపర్ లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం రేవంత్. సీఎం టూర్ నేపథ్యంలో రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమలాపూర్ లో భారీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ విధించారు. ప్రజ్ఞాపూర్ – భువనగిరిల మధ్య వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. భువనగిరి నుంచి ఓఆర్ఆర్ మీదుగా వాహనాలను మళ్లించనున్నారు పోలీసులు.

Exit mobile version