Site icon NTV Telugu

CM Revanth Tweet: తెలంగాణ ఆడబిడ్డ ముఖంలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం..

Revanth Tweet

Revanth Tweet

CM Revanth Tweet: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం శనివారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలకు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Jagga Reddy: ఆర్టీసీ బస్సులో మహిళలతో జగ్గారెడ్డి ముచ్చట.. మహాలక్ష్మి స్కీంపై ఆరా

ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు.. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం అన్న కార్యాచరణ మొదలైంది.. తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం.. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సంక్షేమానికి ఇది మొదటి అడుగు. అని రేవంత్‌ రెడ్డి ట్వీట్ చేశారు.

Exit mobile version