Site icon NTV Telugu

Elevated Corridor: ఉత్తర తెలంగాణకు రాజమార్గం.. ఎలివేటేడ్ కారిడార్‌కు నేడు భూమిపూజ

Elevated Corridor

Elevated Corridor

Elevated Corridor: హైదరాబాద్‌ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్‌ రహదారిపై రూ.2232 కోట్లతో నిర్మించే భారీ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి గురువారం సీఎం రేవంత్‌ రెడ్డి అల్వాల్‌లోని టిమ్స్‌ సమీపంలో నేడు భూమిపూజ చేయనున్నారు. ఈ భారీ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం 11.3 కిలోమీటర్ల పొడవు, 6 లేన్ల వెడల్పుతో జరగనుంది. దీంతో సికింద్రాబాద్‌లో వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. కరీంనగర్ వైపు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడంలో భాగంగానే హైదరాబాద్‌, రామగుండం రహదారికి మహర్ధశ పట్టనుంది.

Read Also: Venkaiah Naidu: నిజాయితీగా పని చేస్తే దేశం అభివృద్ది చెందుతుంది..

ఇటీవల కేంద్రం రక్షణశాఖ భూములు ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా మొదలు రాజీవ్‌ రహదారిపై ప్యారడైజ్‌ నుంచి హకీంపేట్‌ వరకు సుమారు 19 కిలోమీటర్ల పొడవున కారిడార్‌ నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 5న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి డిఫెన్స్‌ భూముల మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అనుమతివ్వాలని లేఖను అందజేశారు.

Exit mobile version