CM Revanth Reddy: 2006లో ఇండిపెండెంట్ జడ్పీ ఛైర్మన్‌గా నిలబడ్డప్పుడు వైఎస్ హవాలోనూ లంబాడా యువకులు తనను జడ్పీటీసీగా గెలిపించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నాలుగు నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నట్లు తెలిపారు.. నేడు సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు.. ఇప్పటికీ కరెంట్ లేని తండాలు ఉన్నాయని.. మానవ జాతి శాంతి మార్గంలో నడవాలి.. శాంతి, భక్తితో సామర్గంతో అభివృద్ధి పదంలో నడవాలని సంత్ సేవలాల్ మహారాజ్ స్ఫుర్తి నింపారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, పునర్నిమాణంలో లంబాడాల పాత్ర ఎవరు తీసిపోలేనిది.. తుడిచి పెట్టలేనిదన్నారు. దళితులతో పాటు గిరిజనులకు మేలు జరగాల్సి ఉందని.. సముచిత స్థానం.. గౌరవం ఇవ్వాలన్నారు. అన్ని తండాలకు బీటీ రోడ్లు ఉన్నాయి. ప్రణాళిక బద్దంగా ప్రతీ తండాలో పాఠశాల ఉండాలి.. భవనం కోసం ఏర్పాట్లు చేయాని సూచించారు. గ్రామ పంచాయతీ లకు భవనం ఉండాలి.. గూడెం అయినా తండా అయినా గ్రామ పంచాయతీ భవనాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
READ MORE: IND vs PAK: పాకిస్థాన్ అంటేనే ఊగిపోతున్న హార్దిక్ పాండ్యా.. గణాంకాలు చూస్తే మతి పోవాల్సిందే!
“87 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గ్రూప్ 1లో ఉద్యోగాలు పొందారు.. 70 వేల ఉద్యాగాలు ఇచ్చాం.. చాలా మంది లంబాడాల ఇంట్లో ఇందిరా గాంధీ ఫోటో ఉంది.. ఇందిరా గాంధీ ఇచ్చినట్టు భూమి ఇవ్వడానికి భూమి అందుబాటులో లేదు.. మీకు సంక్షేమం తో పాటు చదువు ఇవ్వడానికి సిద్ధం.. చదువుకోవడానికి ఏం కావాలో నేను మద్దతు ఇస్తా.. యుక్త వయసులో కష్టపడి చదవండి.. ఉన్నతాధికారుల్లో కీలక పదవులు ఇచ్చా.. వాళ్ళు మీకు ఆదర్శంగా ఉండాలి అని కీలక పదవులు ఇచ్చా.. నేనే మంత్రి. నేనే రాజు.. అంటే నేను మున్సిపల్ మంత్రిని తెలియజేస్తున్నా.. మున్సిపాలిటీలన అభివృద్ధి చేస్తా.. గెలిస్తే ఉప్పొంగను.. ఓడిపోతే కుంగిపోను.. అన్ని హోదాలు చూశా.. పేదల సంక్షేమం కోసం పని చేస్తా.. సంత్ సేవలాల్ మహారాజ్‌కి పుణ్యక్షేత్రం లేదు.. నల్లమల ప్రాంతంలో సంత్ సేవలాల్ మహారాజ్ క్షేత్రం కోసం 20 ఎకరాలు ఇచ్చాం.. వచ్చే ఏడాది ఈ తేదీకి ప్రారంభం చేసుకుందాం.. 2027 ఫిబ్రవరిలో సంత్ సేవలాల్ మహారాజ్ క్షేత్రం ప్రారంభించుకుందాం..” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: Mamta Mohandas : 6 నెలలకే ముగిసిన పెళ్లి.. క్యాన్సర్ ఉన్నప్పుడే ఆ నటుడు నన్ను మోసం చేశాడు..
