Rythu Bharosa Funds: నేడు సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో “ రైతు ఉత్సవాలు” కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అన్నదాతలకు అదిరిపోయే వార్త వచ్చేసింది. నేడు బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. 1.50 కోట్ల ఎకరాలకు సాయం కింద రూ. 9 కోట్లు విడుదల చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల, ఇతర మంత్రుల సమక్షంలో సీఎం వీటిని విడుదల చేస్తారు. ఇక ఈ నగదు ఆదివారం ఆర్బీఐ నుంచి బ్యాంకుల్లోకి చేరనున్నాయి. నేడు ఆదివారం సెలవు కావడంతో సోమవారం రైతన్నల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి.
READ MORE: PEDDI : పెద్ది స్పెషల్ సాంగ్.. రామ్ చరణ్ సరసన సొగసుల సుందరి
ఇదిలా ఉండగా.. సిద్దిపేట జిల్లాలో మొత్తం 775.72 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. నంగునూరు (మం) నర్మెట్టలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో 475.72 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. పామాయిల్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన రైతు మేళా ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు. 30 వేల మంది రైతులతో నర్మెట్టలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రైతులకు రైతు భరోసా నిధులను ఇదే వేదిక నుంచి విడుదల చేస్తారు. ఇక సీఎం పర్యటనకు సందర్భంగా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరనున్న సీఎం రేవంత్.. సాయంత్రం 4 గంటలకు నర్మెట్టలో బహిరంగ సభకు చేరుకుంటారు.
