NTV Telugu Site icon

CM Revanth: మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా.. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ఇందుకోసం ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం తెలిపారు. అధికారులకు పని విభజన చేసి.. మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

Read Also: CM Revanth: ఢిల్లీకి సీఎం రేవంత్, భట్టి.. సడన్గా ఎందుకో తెలుసా..!

రివ్యూ అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్లారు. కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై హైకమాండ్‌తో రేవంత్‌ చర్చించనున్నట్లు సమాచారం తెలుస్తోంది​.

Read Also: Mayawati: పొత్తుల వదంతులపై మాయావతి క్లారిటీ