Site icon NTV Telugu

CM Revanth Reddy: హ్యాండ్లూమ్స్, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (TGCO)పై ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీజీసీవో ఎండీ శైలజ రామయ్యర్, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

Read Also: Godavari Floods: కాళేశ్వరం వద్ద మళ్లీ ఉగ్రరూపం దాల్చిన గోదావరి

ఆగస్టు 15 తర్వాత అన్ని విభాగాల్లో యూనిఫామ్ కొనుగోళ్లు చేసే వారితో సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ, పోలీస్, హెల్త్ విభాగాల్లోనూ ప్రభుత్వ సంస్థల నుంచే క్లాత్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. తద్వారా కార్మికులకు మరింత ఉపాధి కలుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళా శక్తి గ్రూప్ సభ్యులకు బెస్ట్ క్వాలిటీతో డ్రెస్ కోడ్ కోసం ప్రత్యేక డిజైన్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. నిజమైన కార్మికుడికి లబ్ది చేకూరేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Exit mobile version