Site icon NTV Telugu

CM Revanth Reddy: గత పాలనలో రెవెన్యూ ఉద్యోగులపై దోపిడీదారులనే ముద్ర వేశారు: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన “కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కీలకం.. ఉద్యమంలో పాల్గొన్న వారికి గత పదేళ్లలో సరైన గుర్తింపు రాలేదు.. గత పాలనలో రెవెన్యూ ఉద్యోగులపై దోపిడీదారులనే ముద్ర వేశారు.. పంచాయతీ, రెవెన్యూ శాఖ సిబ్బందిని దొంగలుగా చూశారు.. పంచాయతీ, రెవెన్యూ శాఖ సిబ్బంది సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. గత ప్రభుత్వం ధరణి అనే వైరస్‌ను అంటించింది.. ధరణి ద్వారా భూములు కొల్లగొట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది.. ఆ పాపాలు బయట పడతాయనే వీఆర్వో, వీఆర్ఏలను తొలగించారు.. భూముల లెక్కలు తెలిసిన వీఆర్ఏ, వీఆర్వోలను గత ప్రభుత్వం తొలగించింది.. ధరణి కొరివి దయ్యంలా తయారైందని, అందుకే బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పాం.. దానికి అనుగుణంగానే ధరణిని రద్దు చేశామని సీఎం అన్నారు.

READ ALSO: Ajinkya Rahane: టీమిండియాకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారతాడు.. ఆసియా కప్ మనదే!

ఎప్పుడైనా విశ్వాసంతో ఉండే కుక్కని చంపాలి అంటే.. పిచ్చిది అని ముద్ర వేయాలని, వాళ్ల దోపిడిని ప్రజల ముందుకు తీసుకెళ్తారని చెప్పి vra, vro కొలవులను తొలగించారని అన్నారు. అలాగే వీఆర్ఏ, వీఆర్ఓలను దోషులుగా చిత్రీకరించారని పేర్కొన్నారు. తాను పాదయాత్ర చేసినప్పుడు ఎవరినీ కదిలించిన ధరణి నుంచి తప్పించాలని కోరినట్లు తెలిపారు. ధరణిని తొలగించడానికి ప్రభుత్వంలో సమర్థుడైన సహచరుడు ఉండాలని భావించినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సరైన ఎంపిక అని, ఆయన తనను అడగ ముందే రెవెన్యూ, తానే పెద్దలతో మాట్లాడి ఆయనకు రెవెన్యూ శాఖ ఇప్పించినట్లు చెప్పారు. ధరణి ప్రక్షాళన చేయాలి అంటే తనకు సపోర్ట్ మినిస్టర్ ఉండాలని ఆయనను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ధరణి అనే వైరస్ తొలగించాలని భూభారతీ తీసుకొచ్చినట్లు చెప్పారు. సాదా బైనమా కూడా అమలులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఐదారుగురు చెడ గొట్టే వాళ్ళు ఉంటారని, ఇంట్లో ఎలుకలు పడితే ఇల్లు తగలపెడతామా అని సీఎం ప్రశ్నించారు. గత పాలకుల దొంగతనాలు కప్పి పుచ్చుకోవడానికి వీఆర్ఓ, వీఆర్ఏలను తొలగించారని విమర్శించారు.

నెహ్రూ కట్టిన ప్రాజెక్టు ఇంకా చెదరలేదని, గత పాలకులు కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కూలిపోవడానికి కారణం అయిన వాళ్లు వాళ్ల పార్టీని రద్దు చేసుకుంటారా..? అని ప్రశ్నించారు. భూమి మీద ఆధిపత్యం కోసం ఎవరు ప్రయత్నం చేసిన నిలబడలేదని, ధరణి ముసుగులో దోపిడి చేసిన వాళ్లకు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కొలువుల జాతర మొదలైందని చెప్పారు.

READ ALSO: Hyderabad Ganesh Immersion 2025: గణేష్ నిమజ్జనాలు.. రూట్ మ్యాప్

Exit mobile version