Site icon NTV Telugu

CM Revanth Reddy :తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్

Cm Revanth Reddy

Cm Revanth Reddy

జూన్ 21న (రేపు) తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని గుర్తు చేసుకున్నారు. అందుకే తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తన అనుభవాన్ని మొత్తం తెలంగాణకు ధారపోసి, రాష్ట్ర ఏర్పాటుకు ముందే అన్ని రంగాల్లో మన రాష్ట్రానికి ఉన్న ఉజ్వల భవిష్యత్తును వీక్షించిన స్వాప్నికుడు జయశంకర్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట ని రెవిన్యూ విలేజ్ గా ప్రకటించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Exit mobile version