Site icon NTV Telugu

Bharat Future City: ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్.. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి భూమిపూజ..

Bharat Future City

Bharat Future City

Bharat Future City: రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంత భవిష్యత్తు హైదరాబాద్‌కు కేంద్రంగా మారబోతోంది. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ మహానగరానికి మరిన్ని కీలక ప్రాజెక్టులతో కొత్త ఉత్సాహం వస్తోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు ఊపందుకుంటున్న వేళ, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మరిన్ని నిర్మాణాలకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు.

భవిష్యత్తు నగరాన్ని నిర్మించే బాధ్యతను ప్రభుత్వం FCDA (ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ)కి అప్పగించింది. ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు, ఇప్పుడు దాని కార్యాలయాన్ని నగర నడిబొడ్డున కాకుండా, ఫ్యూచర్ సిటీలోనే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీర్‌ఖాన్ పేటలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.19 కోట్లతో FCDA కార్యాలయం రూపుదిద్దుకోనుంది. దీనితో పాటు, మరో 20 ఎకరాల్లో NIUIM (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్) కార్యాలయానికి కూడా స్థలం కేటాయించారు.

IND vs PAK: ఎవరి చేతికి ట్రోఫీ? ముచ్చటగా మూడోసారి.. ఫైనల్లో పాకిస్థాన్తో భారత్ఢీ..

ఇక భారత్ ఫ్యూచర్ సిటీని వివిధ ప్రాంతాల నుంచి సులభంగా చేరుకునేందుకు వీలుగా, ‘రతన్ టాటా రోడ్డు’ పేరిట గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును నిర్మిస్తున్నారు. 300 అడుగుల వెడల్పుతో 41.5 కిలోమీటర్ల ఈ రోడ్డు రెండు దశల్లో రూపుదిద్దుకోనుంది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని రావిర్యాల నుంచి రీజనల్ రింగ్ రోడ్డులోని ఆమనగల్లు వరకు ఇది విస్తరిస్తుంది. ఇందులో భాగంగా మొదటి దశలో భాగంగా.. రావిర్యాల (టాటా ఇంటర్‌చేంజ్) నుంచి మీర్‌ఖాన్ పేట వరకు 19.20 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.1,665 కోట్లు కేటాయించారు. ఇక రెండో దశలో భాగంగా మీర్‌ఖాన్ పేట నుంచి ఆమనగల్లు వరకు 22.30 కిలోమీటర్ల రోడ్డు కోసం రూ.2,365 కోట్లు మంజూరు చేశారు.

ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే, హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, నాగార్జున సాగర్, విజయవాడ రహదారుల నుంచి ఫ్యూచర్ సిటీకి నేరుగా చేరుకోవడం సులభతరం అవుతుంది. ఇక నేడు (ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండు కీలక ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. అధికార యంత్రాంగం ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

Off The Record : జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటనతో బీఆర్ఎస్ లో అలకలు

Exit mobile version