NTV Telugu Site icon

Yadagirigutta: ఘనంగా మహా కుంభాభిషేకం.. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరు

Yadagirigutta (1)

Yadagirigutta (1)

Yadagirigutta: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు పంచకుండాత్మక మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం వారు అంతరాలయం మాడ వీధుల్లోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, వామనామలై పీఠాధిపతి సూచనల మేరకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వర్ణమయ పంచతల విమాన గోపురం వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు.

Read Also: Ponnam Prabhakar: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పథకాలు అమలు చేస్తున్నాం

మహా కుంభాభిషేకం, సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య భక్తి శ్రద్ధలతో కూడిన వాతావరణం నెలకొంది. భక్తులు భారీగా తరలిరావడంతో ఈ మహా కుంభాభిషేకం కార్యక్రమం యాదాద్రి ఆలయ మహిమను మరింత పెంచనుంది.

Read Also: Sridhar Babu: ప్రజలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను చేపట్టాం.. మంత్రి కీలక వ్యాఖ్యలు