Site icon NTV Telugu

CM Revanth Reddy: గవర్నర్ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్‌ విస్తరణ, బిల్లులు, పెండింగ్‌ ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్‌తో సీఎం రేవంత్ చర్చ జరిపారు. జులై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు కేబినెట్‌ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బిల్లుల కోసమే గవర్నర్‌తో సీఎం సమావేశమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read Also: National Doctors Day 2024: మానసిక ఆరోగ్యం, సామాజిక సవాళ్లతో పోరాడుతున్న డాక్టర్లు

Exit mobile version