NTV Telugu Site icon

Governor Jishnu Dev Varma: కుల గణన, మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్‌కి గవర్నర్ కీలక సూచనలు..

Cmrevanth

Cmrevanth

కుల గణన, మూసి ప్రక్షాళనపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్‌ భేటీలో చర్చ జరిగింది. మూసి ప్రక్షాళనపై సీఎంని గవర్నర్ ఆరా తీశారు. పేదలు నష్టపోకుండా చూడాలని.. పరిహారం అందించడంలో ఉదారంగా ఉండాలని సీఎంకి గవర్నర్ సూచించారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించినట్లు సీఎం ఆయనకు తెలిపారు. మరికొంత మందికి కూడా పరిహారం అందించడంలో ఇబ్బంది లేదని.. పేదలను సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాజ్ భవన్ లో గవర్నర్.. సీఎం ఇద్దరు 10 నిమిషాల ఏకాంత భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును గవర్నర్ కు వివరించిన సీఎం వివరించారు.

READ MORE: US Election Results: భోరున విలపించిన కమలాహారిస్ మద్దతుదారులు.. ఫొటోలు వైరల్

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవనుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 2025 చేపట్టే దేశవ్యాప్త జన గణలో తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్ ను ఆహ్వానించారు.

READ MORE: 2008 Dsc: 2008 డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. ప్రక్రియ వేగవంతం

Show comments