Site icon NTV Telugu

CM Revanth Reddy: మాజీ ఆర్బీఐ గవర్నర్ తో సీఎం రేవంత్ భేటీ.. ఆర్థిక పరిస్థితి పై చర్చ

Raghuram Rajan

Raghuram Rajan

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వంతో మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ముందుకు వచ్చారు. ఇందులో భాగంగానే.. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్.. సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణా రావు, సీఎం సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు.

Read also: Nani: ఒకే ఏడాదిలో రెండుసార్లు ఆ రికార్డుని పాన్ ఇండియా హీరోలు కూడా సాధించలేదు…

అయితే, 2016 డీమోనిటైజేషన్‌కు సంబంధించిన ప్రశ్నపై నిన్న రఘురామ్ రాజన్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చిన విషయం తెసిందే.. డీమోనిటైజేషన్ ప్లాన్ పని చేస్తుందా లేదా అని ప్రధాని కార్యాలయం తనను అడిగింది.. దీనిపై, నేను నా బృందం ఈ నిర్ణయంలోని మంచి, చెడులను చెప్పాము అని రాజన్ తెలిపారు. అయితే, మనకు స్వాతంత్ర్యం వచ్చిన 100వ సంవత్సరం నాటికి అంటే 2047 వరకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం చాలా కష్టమని రఘురామ్ రాజన్ తెలిపారు. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. కొన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ఇవ్వరాదు అంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు.
Nani: ఒకే ఏడాదిలో రెండుసార్లు ఆ రికార్డుని పాన్ ఇండియా హీరోలు కూడా సాధించలేదు…

Exit mobile version