NTV Telugu Site icon

CM Revanth Reddy: అమెరికా పర్యటనలో సీఎం బిజీబిజీ.. అడోబ్ సిస్టమ్స్ సీఈవోతో భేటీ

Cm Revanth

Cm Revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి.. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు. రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి రాయితీలు ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోబ్​ సిస్టమ్స్ (Adobe Systems) సీఈవో శంతను నారాయణ్‌తో భేటీ అయ్యారు.

Read Also: Bhatti Vikramarka: మూడో విడత రుణమాఫీపై రైతులకు శుభవార్త.. ఆ రోజున రుణమాఫీ

ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అడోబ్​ సీఈవోతో సమావేశంలో సీఎంతో పాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను నారాయణ్​ ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు. టెక్ విజనరీ శంతను నారాయణ్ను కలుసుకోవటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Read Also: Methane-eating bacteria: భారత్‌లో తొలిసారి ‘‘మిథేన్‌-ఈటింగ్ బ్యాక్టీరియా’’ కనుగొన్నారు.. దీంతో చాలా ఉపయోగాలు..

Show comments