Site icon NTV Telugu

Nitin Gadkari: కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి భేటీ.. పలు రోడ్ల నిర్మాణాలపై చర్చలు!

Nithin Gadkari

Nithin Gadkari

Nitin Gadkari: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇరువురు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో సీఎం చర్చలు చేపట్టారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలుపాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని ఏకకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని సీఎం కేంద్రమంత్రిని కోరారు.

Read Also: DC vs SRH: కమ్మిన్స్ దెబ్బకు ఢిల్లీ బ్యాటర్లు విలవిల.. ఎస్ఆర్హెచ్ ముందు స్వల్ప లక్ష్యం.!

ఎన్ హెచ్ 765 లోని హైదరాబాద్ – శ్రీశైలం సెక్షన్ కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని, అలాగే హైదరాబాద్ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే ను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని సీఎం కోరినిట్లు సమాచారం. ORR, RRR లను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. అలాగే హైదరాబాద్ – డిండి – మన్ననూర్, హైదరాబాద్ – మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే, ఓఆర్ఆర్ నుంచి మన్నెగూడ వరకు రేడియల్ రోడ్ అభివృద్ధి పనులకు సంబంధించి వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విన్నవించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంతోపాటు గడ్కరీతో భేటీలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, సలహాదారులు హర్కర వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version