Site icon NTV Telugu

CM Revanth Reddy: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Revanth

Revanth

ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, లా సెక్రటరీ పాపి రెడ్డి, జస్టిస్ పి. సామ్ కోశి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై చర్చించారు.

Also Read:Shiva Re-Release : కింగ్ నాగ్ ‘శివ’ రీరిలీజ్ డేట్ ఫిక్స్..!

కొత్త జిల్లాల్లో అవసరమైన చోట కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు సీజే సూచించారు. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు హైకోర్టు సీజే. ప్రాధాన్యత వారీగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కొత్త జిల్లాలలో కోర్టులకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.

Exit mobile version