NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ సమావేశం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో అన్ని రకాల సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు సీఎంవో వర్గాలు పలు సంఘాలకు సమాచారాన్ని అందించాయి. సీఎంవో నుంచి టీఎన్జీవో, టీజీవోలతో పాటు గుర్తింపు పొందిన టీచర్ల సంఘాల్లోని నేతలకు ఫోన్లు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న 4డీఏలు, 317 జీవో సవరణ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌), ఉద్యోగుల మెడికల్‌ బిల్స్‌, సీపీఎస్‌ రద్దు, ఉద్యోగుల సాధారణ బదిలీలు, పీఆర్సీ, జోనల్ వ్యవస్థ వంటి అంశాలపై చర్చ జరగనుందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. వచ్చే వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేబినెట్ మీటింగ్‌లో పెండింగ్ డీఏలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Read Also: Accident: ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని గొర్రెల కాపరి, 80 గొర్రెలు మృతి