గత వారం జరిగిన సమీక్షలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌లో ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు. దానికి అనుగుణంగా అధికారులు అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేశారు. అందులో కొన్ని తేడాలు ఉండడంతో మరిన్ని మార్పులను ముఖ్యమంత్రి సూచించారు. ఆ మార్పులకు అనుగుణంగా అలైన్‌మెంట్ మార్చాలని… అది ఫైనల్ అయిపోతే తర్వాత కార్యాచరణ వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించనున్న . ప్రతిపాదిత రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ సమీకరణ, భూ సేకరణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏరహదారులు, ఇతర అభివృద్ధి పనులకు భూ సేకరణ చేసేటప్పుడు మానవీయ కోణంతో ఆలోచించాలని, భూ నిర్వాసితులతో సానుభూతితో వ్యవహరించాలని, సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
Amaravathi: రాష్ట్రంలోని పత్తినంతా కొనుగోలు చేయాలి.. కేంద్రానికి మంత్రులు లేఖ
డ్రైపోర్ట్ నిర్మాణం విషయంలో మచిలీపట్నం, కాకినాడ రేవులను పరిగణనలోకి తీసుకోవాలని, దూరంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మార్గానికి సుముఖంగా ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు ఏరకంగా మేలు జరుగుతుందనే విషయం ప్రాధాన్యతలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇవన్నీ అధ్యయనం చేశాకే గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఓఆర్ఆర్ -ఆర్ఆర్ఆర్ మధ్య రావిర్యాల నుంచి అమన్‌గల్ వరకు నిర్మించనున్న రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
Maharashtra: ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో శిల్పిపై హత్యాయత్నం కేసు