NTV Telugu Site icon

CM Revanth Reddy : పంచాయతీరాజ్ శాఖపై ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

Cm Revanth Reddy

Cm Revanth Reddy

పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో… రిజర్వేషన్లపై ఒక అవగాహన కోసం సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రెజర్వేషన్ల పెంపుపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. పంచాయ‌తీల ఎన్నిక‌ల‌కు సంబంధించి బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుపై స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్ల అమ‌లు, రాబోయే ఎన్నిక‌ల్లో వాటి పెంపున‌కు సంబంధించిన అంశాల‌ను వెల్ల‌డించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. గ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల అనుస‌రించిన విధానం, రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న తీరును అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. ఇప్ప‌టికే కుల గ‌ణ‌నకు ఆమోదం తెలిపినందున‌, దాని ఆధారంగా పంచాయ‌తీ ఎన్నికల‌కు వెళితే ఎలా ఉంటుంద‌ని, అందుకు ఎంత స‌మ‌యం తీసుకుంటార‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ప్ర‌శ్నించారు.