NTV Telugu Site icon

CM Revanth Reddy : గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం

Revanth Reddy

Revanth Reddy

ప్రజాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని ఆయన మండిపడ్డారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని ఆయన వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత అని ఆయన అన్నారు. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని, రేపు సాయంత్రం 4గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయని, నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Minister Satyakumar: ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసిన ఏపీ మంత్రి సత్యకుమార్

ఆగస్టులో రూ.2లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని, రుణమాఫీ పేరుతో కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడంలేదన్నారు సీఎం రేవంత్‌. ఏకమొత్తంలో రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామని, రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నామన్నారు. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించండని ఆయన కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించండని, రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని, రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంట్ లో ఎంపీలు ప్రస్తావించాలన్నారు. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని, ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి రూ.30వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. రేపు సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ. నెలాఖరులోగా లక్షన్నర వరకు ఉన్న రైతు రుణం మాఫీ. వచ్చేనెలలో రూ.2లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Rambha Daughter: హీరోయిన్లను మించేలా రంభ కూతురు.. స్టార్ హీరోతో ఫొటోలు చూశారా ?