CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్‌లో కాళేశ్వరం బయలుదేరుతారు. కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతీ పుష్కర ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు. సాయంత్రం 5.20 గంటలకు కాళేశ్వరంలోని పుష్కర ఘాట్‌లో ఏర్పాటు చేసిన 17 అడుగుల శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
ShriyaSaran : ఓ వైపు జోరు వానలు. మరోవైపు శ్రేయ అందాల వేడి సెగలు..
కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6.40 గంటలకు సరస్వతి ఘాట్‌లో సరస్వతీ నవరత్నమాల హారతి దర్శనం ఉంటుంది. రాత్రి 7.30 గంటలకు పుష్కరాలకు విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 8 గంటలకు కాళేశ్వరం నుండి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాళేశ్వరంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
