Site icon NTV Telugu

CM Revanth Reddy : తెలంగాణ స్పోర్ట్స్ లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ రెడ్డి

Telangana Sports Logo

Telangana Sports Logo

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన రాష్ట్ర స్పోర్ట్స్ లోగో ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ భేటీ అయ్యారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎంను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడిని అందించే కొత్త వంగడాలపై పరిశోధనలు చేయాలని ఈ సందర్భంగా జాక్వెలిన్ కు సీఎం సూచించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఉపయోగపడేలా పరిశోధనలు ఉండాలన్నారు. ఇక్రిశాట్ ను సందర్శించాలని సీఎం ను జాక్వెలిన్ కోరగా తప్పక సందర్శిస్తానని రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

YS Jagan: అందుకే వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. క్లారిటీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌

Exit mobile version